కాకినాడ జీ వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని కాకినాడ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన పార్వతీపరమేశ్వర ఫైర్ వర్క్స్‌కు అనుమతులు ఉన్నాయని తెలిపారు. చిచ్చుబుడ్డులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని చెప్పారు.