‘వైయస్ఆర్ కళ్యాణమస్తు - షాదీతోఫా’ పథకంతో పేదింట పెళ్లి వేడుకంట!
బాల్య వివాహలకు అడ్డుకట్ట వేసేలా, అక్షరాస్యతను మరింత పెంపొందించేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లు సజావుగా సాగేలా జగనన్న అందిస్తున్న సాయమిది.
వివాహ తేదీ నాటికి వధువుకు 18 ఏళ్లు, వరుడి వయసు 21 ఏళ్లు పైబడిన వారికి గౌరవప్రదంగా వివాహం చేయడమే లక్ష్యంగా సాగే మంగళకరమైన పథకమిది. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు నేడు ₹81.64 కోట్ల ఆర్థికసాయం జమ.