దేవుడి దయవల్ల క్షేమంగా బయటపడ్డా | Rajasekhar Gives Clarification On Car Accident | Sakshi
Sakshi News home page

దేవుడి దయవల్ల క్షేమంగా బయటపడ్డా

Nov 13 2019 5:57 PM | Updated on Mar 21 2024 8:31 PM

ప్రముఖ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం వేకువజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.  రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో ఈ ప్రమాదంపై అనేక వార్తలు వస్తున్న తరుణంలో రాజశేఖర్‌ మీడియా ముందుకు వచ్చారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఒళ్లు నొప్పులున్నాయి తప్పా ఎలాంటి పెద్దగాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వారితో పాటు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపిన రాజశేఖర్‌.. ఎవరూ ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. ఇక రాజశేఖర్‌ పూర్తి సందేశం కింది వీడియోలో..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement