రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2

ఢిల్లీ : తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన బాహుబలి సిరీస్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండియన్‌ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా రష్యాలోనూ ఇరగదీస్తోంది. అయితే థియోటర్లో అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా అక్కడి టీవీ చానెల్‌లో ప్లే అవుతుంది. రష్యన్‌ వాయిస్‌ఓవర్‌తో డబ్బింగ్‌ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో దుమ్ముదులుపుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top