గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న తారక్‌ | Jr NTR playing with Horse on the sets of Rajamouli RRR | Sakshi
Sakshi News home page

గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న తారక్‌

Jun 26 2019 3:14 PM | Updated on Mar 22 2024 10:40 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో అలరించనున్నాడు. ఇటీవల చరణ్‌, తారక్‌ల గాయాల కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఆర్‌ఆర్‌ఆర్‌ తిరిగి మొదలు కానుంది.

ఈసందర్భంగా సెట్‌లో ఎన్టీఆర్‌ సందడి చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. చారిత్రక కథాంశం కావటంతో గుర్రపు స్వారీలు ఉంటాయి. అందుకే ఎన్టీఆర్‌ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడిని సెట్‌ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement