భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు! | Hero Salman Khan caught smoking during Ganpati celebrations, fans Upset | Sakshi
Sakshi News home page

భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు!

Sep 8 2019 11:27 AM | Updated on Mar 22 2024 11:30 AM

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు భారీగా అభిమానగణం ఉంది. వరుసగా సూపర్‌హిట్స్‌ ఇస్తున్న ఈ కండలవీరుడికి వివాదాలు కూడా కొత్త కాదు. ఏదైనా వివాదంలో సల్మాన్‌ చిక్కుకుంటే.. ఆయనను సమర్థించడానికి ఫ్యాన్స్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ, తాజాగా వినాయక చవితి వేడుకల సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ సిగరెట్‌ తాగుతూ కనిపించడం ఆయన ఫ్యాన్స్‌కే నచ్చలేదు. ఈ విషయంలో సల్మాన్‌ తీరును తప్పుబడుతూ పలువురు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు.

సల్మాన్‌ స్మోకింగ్‌ చేస్తున్న వీడియో ఇటీవల వైరల్‌ అయింది. తన సోదరి అర్పితా ఇటీవల వినాయక చవితి వేడుకలు నిర్వహించిన సందర్భంగా సల్మాన్‌ ఇలా సిగరేట్‌ తాగుతూ కనిపించారని పలు వెబ్‌సైట్లు ప్రచురించాయి. ఈ వీడియోపై సల్మాన్‌ ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. ‘భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు’ అని కామెంట్‌ చేస్తున్నారు. గణేష్‌ చతుర్థి వేడుకల్లో భాగంగా సల్మాన్‌, ఆయన సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌ వినాయకుడికి హారతి ఇచ్చిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ముస్లిం అయి ఉండి గణేషుడికి హారతి ఇస్తావా? అని కొందరు తప్పుబట్టగా.. మరికొందరు సల్మాన్‌ తీరును ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement