మా అధ్యక్ష ఎన్నికల్లో నరేష్ విజయం | Actor Naresh Win in MAA Elections | Sakshi
Sakshi News home page

మా అధ్యక్ష ఎన్నికల్లో నరేష్ విజయం

Mar 11 2019 7:34 AM | Updated on Mar 22 2024 11:31 AM

మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌) అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్‌ నటుడు నరేష్‌ విజయం సాధించారు. ప్రత్యర్థి శివాజీ రాజాపై ఆయన గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్  సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై  రాజీవ్ కనకాల గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement