52 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ సోమన్ మిలింద్ 23 ఏళ్ల అంకిత కోన్వర్‌లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను మిలింద్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు . అయితే ఆ మద్య సోషల్ మీడియాలో మిలింద్, అంకిత ఫొటోలను నెటిజన్లు చూసి.. ‘అంకిత నీ ప్రేయసినా.. లేక కూతురా..? నీ కన్నా 33 సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమాయణమేంటీ’ అని కామెంట్లు కూడా చేశారు. వీటన్నింటికి ఇక ఫులిస్టాప్ పెట్టనున్నారు.