శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానం సరదా కాస్తా వారి ప్రాణాల మీదకు తెచ్చింది. సముద్ర స్నానానికి వెళ్లిన అయిదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థులు.