రిలయన్స్ 41వ వార్షిక సమావేశం

జియో ఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్‌ అంబానీలు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ ఫోన్‌ కోసం ముఖేష్‌ అంబానీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. జియోఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్‌ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్‌ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. జూలై 21 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయితే కమర్షియల్‌గా ఈ కొత్త జియోఫోన్‌ 2 విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.2,999గా ముఖేష్‌ అంబానీ చెప్పారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన  41వ వార్షికోత్సవ సమావేశంలో పలు సర్వీసులను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రవేశపెట్టింది. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top