ఇంటర్నెట్ సదుపాయం ద్వారా మనకు కావాల్సిన పాటలు, వార్తలు, జోకులు ఎల్ల వేళలా వినేందుకు అమెజాన్ కంపెనీ (అమెజాన్ వాయిస్ అసిస్టెంట్) ‘అలెక్సా’ యాప్ కలిగిన ‘అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదే అమెజాన్ కంపెనీ ‘వైర్ లెస్ ఎకో ఇయర్ బడ్స్’ను తీసుకొస్తోంది. దీనికి కూడా ‘వాయిస్ కమాండ్స్’ను రిసీవ్ చేసుకొనే ‘అలెక్సా’ను అనుసంధానించింది. ‘అలెక్సా!’ అని సంబోధించడం ద్వారా మనం కోరిన పాట, వార్తలు లేదా జోక్స్‌ను ఇంటర్నెట్‌లో వెతుక్కొని అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో (కమాండింగ్‌తో) పనిచేసే వైర్ అవసరం లేని ఇయర్ బడ్స్‌ను తీసుకొస్తోంది.
అమెజాన్ నుంచి ‘అలెక్సా’ ఇయర్ బడ్స్
Sep 27 2019 3:18 PM | Updated on Sep 27 2019 3:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement