నిప్పురవ్వ తాకితేనే ఒళ్లు చురుక్కుమంటుంది. అలాంటిది ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఎదురొడ్డి నిలబడతారు వాళ్లు. జలఖడ్గంతో అగ్గిబరాటాలపై విరుచుకుపడతారు. మంటల్లో చిక్కుకున్న ప్రాణాలను తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షిస్తారు. అగ్గిలో బుగ్గిపాలవుతున్న ఆస్తిని కాపాడతారు. తరచూ రెస్క్యూ ఆపరేషన్స్‌తో రిస్క్ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది అంటే మనపాలిట ఆపద్బాంధవులు. ఈ ఫైర్ ఫైటర్స్‌ను సాక్షిసిటీప్లస్ తరఫున నటుడు బ్రహ్మాజీ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు.