సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఎట్టకేలకు దిగివచ్చింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలా అపాయింట్మెంట్ను రద్దు చేస్తూ ఐఓఏ నిర్ణయం తీసుకుంది. సురేష్ కల్మాడీకి జీవితకాల అధ్యక్షుడిగా పగ్గాలు అప్పచెబుతూ ఇటీవల ఐఓఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.