ఓ దశలో ఆసీస్ స్కోరు 37.4 ఓవర్లలో 224/1. అప్పటికే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వీర బాదుడుతో శతకం సాధించి జట్టును అత్యంత పటిష్టమైన స్థితికి చేర్చగా, అతనితో పాటు క్రీజులో స్మిత్ ఉన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉండటంతో స్కోరు 350 వరకు చేరుతుందేమో అని అంతా భావించారు.