విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు శనివారం ఉదయం రాజ్‌కోట్‌కు చేరుకుంది. స్థానిక ఆటగాళ్లు పుజారా, జడేజా జట్టుతో పాటు కలిశారని.. హార్ధిక్ పాండ్యా రోడ్డు మార్గం ద్వారా రాజ్‌కోట్‌కు వచ్చినట్టు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మీడియా మేనేజర్ హిమాన్షు షా వెల్లడించారు. శనివారమే 28వ పడిలోకి అడుగుపెట్టిన కోహ్లి... జట్టు ఆటగాళ్లు, ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి హోటల్‌లో ఘనంగా వేడుకలు జరుపుకున్నాడు. అటు కోహ్లి పుట్టిన రోజు సందర్భంగా సచిన్, సెహ్వాగ్, యూసుఫ్ పఠాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్‌కోట్ ఎరుుర్‌పోర్ట్‌లో అభిమానులు పెద్ద సంఖ్యలో కేకులు, బొకేలతో కోహ్లికి స్వాగతం పలకగా తను అనుష్కతో కలిసి నేరుగా హోటల్‌కు వెళ్లిపోయాడు.
Nov 6 2016 6:52 AM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement