టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్‌కు దేశభక్తి చాలా ఎక్కువ. పాకిస్తాన్ అంటే చాలు మనోడికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. తాజాగా కశ్మీర్‌లో భారతీయ బలగాల మీద కొందరు దాడులు చేయడంతో గంభీర్ బాగా ఆవేశానికి గురయ్యాడు. భారతీయ సైనికుడి మీద ఒక్క దెబ్బ పడితే.. కనీసం వంద మంది జీహాదీల ప్రాణాలు తీయాలని అన్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలనే వాళ్లకు కూడా గట్టిగా బుద్ధి చెప్పాడు. మన జాతీయ పతాకంలో మూడు రంగులకు మంచి అర్థం ఉందని, అందులో కాషాయ రంగు ఆగ్రహంతో కూడిన మంట అయితే, తెలుపురంగు జీహాదీల శవం మీద కప్పే వస్త్రమని, ఆకుపచ్చ రంగు ఉగ్రవాదాన్ని ద్వేషించడమని తనదైన శైలిలో భాష్యం చెప్పాడు. ఈ మేరకు గురువారం నాడు వరుసపెట్టి ట్వీట్లు చేశాడు.