ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పులివెందుల వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో ఆయనను నిర్భంధించారు. కాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్తగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమన్నారు.