మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయిదో వర్థంతి సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మంగళవారం వైఎస్ఆర్ ఎల్పీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లో వున్న దివంగత నేత విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వైఎస్ఆర్ జోహార్ అంటూ నినదించారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు.