ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న తమకు నిధులెందుకు ఇవ్వడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలెన్నుకున్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా, ఓడిపోయి న వారికి ఎస్‌డీఎఫ్ నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ... ఇది నిరంకుశత్వమని నేరుగా విమర్శించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో 34 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయనతో జరిగిన సమావేశ వివరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. తామెన్ని సమస్యలు చెప్పినా ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరించారని తెలిపారు. ఇంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. కనీసం సానుకూలంగా కూడా మాట్లాడకుండా, కక్ష సాధింపు ధోరణిలోనే మాట్లాడారని చెప్పారు.
Nov 26 2016 7:14 AM | Updated on Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement