అసెంబ్లీకి ఎప్పుడు వచ్చామన్నది కాదు.. ప్రజాసమస్యలపై ఎలా స్పందించామన్నదే ముఖ్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆమె మీడియా వద్ద మాట్లాడారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై కేవలం ప్రకటన చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని రోజా అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని చెప్పారు. మనిషిని ఢీకొట్టి చంద్రబాబునాయుడు ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసని అన్నారు.