ఢిల్లీ చేరుకున్న వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి బృందం | YS Vijayamma Reaches Delhi To Meet President,Prime Minister Others | Sakshi
Sakshi News home page

Aug 27 2013 9:15 AM | Updated on Mar 21 2024 5:15 PM

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల తీరును కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీ చేరుకుంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఈ రోజు ఉదయం హస్తినకు చేరుకున్నారు. ఈ బృందంలో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దూరదృష్టి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరంకుశంగా తీసుకున్న నిర్ణయంవల్ల రగిలిపోతున్న పరిస్థితులు, సీమాంధ్ర ప్రజల ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం 12.30 గంటల అనంతరం వీరు రాష్ట్రపతిని కలిసి ఇక్కడి ప్రజల ఆవేదనను విన్నవిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కూడా రాష్ట్ర ప్రజల ఆందోళనలపై వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement