తాను ఓటమిని ఒప్పుకోనని, గెలిచేవరకు పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని జగన్ ప్రశ్నించారు.