ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసససభలో మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం జగన్ మాట్లాడారు. బిల్లులో ఒకటి.. మాటల్లో ఒకటి ఉంటే అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు మంత్రి నారాయణ చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవని జగన్ తెలిపారు. వైఎస్సార్ సీపీ సభ్యులకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఏ విషయమూ లేదన్నారు. ఏ విషయమూ లేకుండా చర్చలో ఎలా పాల్గొనాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు ఏమిస్తున్నారో ఎమ్మెల్యేలకు ఇచ్చిన 120 డాక్యుమెంట్లలో అయితే లేవని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Dec 22 2014 6:07 PM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement