జిల్లాలో ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది. ఆత్మకూరు(ఎస్) మండలం ఎంపీపీ కసాగాని లక్ష్మిబ్రహ్మం కుమారుడు సతీష్, ముల్కలపల్లికి చెందిన యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇన్నాళ్లు ప్రేమించిన సతీష్ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని యువతి ఆందోళనకు దిగింది.