‘సినిమా ఇండస్ట్రీని టార్గెట్‌ చేయలేదు’ | we are not target film industry in drugs case, says chandravadan | Sakshi
Sakshi News home page

Jul 24 2017 5:30 PM | Updated on Mar 22 2024 10:55 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఆర్‌వీ చంద్రవదన్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో చట్టానికి లోబడి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 27 మందికి నోటీసులిచ్చామని, 19 మందిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. నోటీసులు ఇచ్చినవారిలో 12 మంది సినిమా ప్రముఖులు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు ఐదుగురు ప్రశ్నించినట్టు తెలిపారు. దర్యాప్తు ఆగస్టు 2 వరకు కొనసాగుతుందని, చట్టానికి లోబడి విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement