ముంబైలో హవాల గుట్టును ఐటీ అధికారులు మంగళవారం రట్టు చేశారు. నగరంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును ఐటీ శాఖ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. నాలుగు ట్రక్కుల్లో దాదాపు 150 సూట్ కేసుల్లో రూ. 2500 కోట్ల నగదును ముంబై నుంచి గుజరాత్కు తరలిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులు దాదాపు వారం రోజుల పాటు కసరత్తు చేసి వలపన్ని ఆ నగదును సీజ్ చేశారు. అయితే అంత భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణ వెనక ఎవరైన ప్రుముఖుల హస్తం ఉందా అని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే దాదాపు 50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.