తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న‘తెలంగాణ సాధన సభ’ ప్రారంభమయింది. నిజాం కళాశాల మైదానంలో ఈ మధ్యాహ్నం ప్రారంభమయిన ఈ బహిరంగ సభకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, జనం తరలివచ్చారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్సేనన్న సంకేతాలు పంపడంతోపాటు ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారన్న భావనను అధిష్టానానికి కలిగించేందుకు టి. కాంగ్రెస్ నేతలు ఈ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సభకు తరలివచ్చారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ సభకు హాజరు కాలేదు. తెలంగాణ అమర వీరులకు సభ నివాళులర్పించింది.