బియాస్ నది ఘటన మరవకు మందే మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు సరయూ నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని వేదపాఠశాల నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వెళ్లారు. అందులోభాగంగా బుధవారం ఉదయం ఫోటో దిగేందుకు సరయూ నదిలోకి దిగారు. ఆ క్రమంలో నీటి ప్రవాహానికి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దాంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు హాహాకారాలు చేయడంతో స్థానికులు నదిలోకి దూకి... గల్లంతైన విద్యార్థులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులు మల్కాజ్ గిరి వాణినగర్ కు చెందిన కిరణ్, చక్రపాణిలుగా గుర్తించినట్లు వేద పాఠశాలకు చెందిన ప్రతినిధిలు చెప్పారు.
Jul 2 2014 10:28 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement