రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 17 మందికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఒడిషాలోని కటక్లో కాథోజోడీ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. భువనేశ్వర్-భద్రాక్ ప్యాసెంజర్ రైలు వెనక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో రైల్వే అధికారులు ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.