ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని, ఆయన తన బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారని ఆమె మండిపడ్డారు. ఆది నుంచి తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేస్తూనే ఉన్నారని కవిత శుక్రవారమిక్కడ అన్నారు. తెలంగాణలో టీడీపీ ఉండటానికి అర్హత లేదనే విధంగా చంద్రబాబే నిరూపించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ దుకాణాన్ని మూసుకుంటే బాగుంటుందని కవిత వ్యాఖ్యానించారు.