సార్వత్రిక సమ్మెకు సిద్ధంమెజారిటీ కార్మిక సంఘాల మద్దతు సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో సెప్టెంబర్ 2న (బుధవారం) నగరంలో సిటీబస్సులు, ఆటోలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను నగరంలో విజయవంతం చేసేందుకు మెజారిటీ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని 3,800 సిటీ బస్సులు, 1.20 లక్షలకు పైగా ఆటో రిక్షాలు తిరిగే అవకాశం లేదు. ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లు సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపాయి