కానిస్టేబుల్‌ నియామకాల్లో అక్రమాల్లేవు | There is no irregularities in Constable recruitment | Sakshi
Sakshi News home page

Feb 21 2017 6:53 AM | Updated on Mar 22 2024 11:29 AM

కానిస్టేబుల్‌ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ పూర్ణచందర్‌రావు స్పష్టంచేశారు. ఒక్కో కేటగిరీకి ఒకో విధంగా మార్కుల కటాఫ్‌ ఉంటుందని, ఈ విషయంలో అనుమానాలున్న అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ను పరిశీలించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు సోమవారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు రావడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఒకే కేటగిరీ ఉన్నా, తమ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి ఎలా ఎంపికయ్యాడో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement