నోట్ల రద్దు అతిపెద్ద తప్పుడు ప్రయోగం | The largest false experiment | Sakshi
Sakshi News home page

Nov 24 2016 7:13 AM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో.. దాదాపు 200 మంది ఎంపీలు (కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం) హాజరై.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కేంద్రం నిర్ణయం ఆర్థికంగా అతిపెద్ద తప్పుడు ప్రయోగం. దీనిపై మోదీ ఆర్థిక మంత్రి సహా ఎవరినీ సంప్రదించలేదు. ఈ స్కాంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలి’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంతపెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఉద్దేశపూర్వకంగానే కొందరు పారిశ్రామికవేత్తలకు లీక్ చేశారో పార్లమెంటులో చెప్పాలన్నారు. కోట్ల మంది ఇబ్బందులు ఎందుకు పడాలన్నారు. ‘పార్లమెంటుకు ప్రధాని హాజరై.. చర్చ మొత్తం విని జవాబుచెప్పాలి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement