రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు | Sakshi
Sakshi News home page

రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు

Published Fri, Feb 17 2017 7:30 AM

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం రెండింతలైంది. రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన రూ.60 వేల కోట్ల అప్పు మూడేళ్లలోపే దాదాపు రెట్టింపైంది. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది రూ.10 వేల కోట్లు, రెండో ఏడాది రూ.16 వేల కోట్లు అప్పులు చేసింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే రూ.21 వేల కోట్లు అప్పు చేసింది. విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్‌ పథకంలో చేరడంతో తాజాగా మరో రూ.8,923 కోట్ల అప్పు డిస్కంల నుంచి రాష్ట్ర ఖజానాకు బదిలీ అయింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ.1.16 లక్షల కోట్లకు చేరింది. ఏటా ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రం రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో రుణ సమీకరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది! అవి చేసేవాటిని కార్పొరేషన్‌ రుణాలుగా చెప్పినా, అవి చెల్లించలేని పక్షంలో ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుంది.