జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం | Telangana Cabinet decisions | Sakshi
Sakshi News home page

Oct 22 2016 6:57 AM | Updated on Mar 21 2024 8:56 PM

కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా, కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ట్రిబ్యునల్ తీర్పుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తెలంగాణపై ప్రభావం, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని అధ్యయనం చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. ఏపీ వైఖరితో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేలా మన వ్యూహం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సబ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement