రాజకీయ లబ్ధి కోసమే విభజన: జ్యోతుల నెహ్రు | state bifurcation due to political gain says jyothula nehru | Sakshi
Sakshi News home page

Oct 26 2013 2:52 PM | Updated on Mar 21 2024 6:14 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ లబ్ది కోసమే విభజిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసి సమైక్య శంఖారావం సభలో జ్యోతుల నెహ్రు ప్రసంగిస్తూ... తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాలు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అడ్డగోలుగా నిర్ణయాలు జరుగుతున్నాయి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో ఇరు ప్రాంతాలకు శాశ్వత నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది సమైక్య సభకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో ఎంతోమంది నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని జ్యోతుల నెహ్రు ఆరోపించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు కలసిరావాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement