మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకుని.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ లో హతమైన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సిమి కార్యక్తరల ఎన్ కౌంటర్ పై సుప్రీం జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడివని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.