'వైఎస్‌ఆర్ పథకాలు బతికించుకుందాం' | Sharmila Visitation Tour at Greater Hyderabad | Sakshi
Sakshi News home page

Jan 7 2016 6:53 AM | Updated on Mar 21 2024 8:11 PM

ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన పథకాలను బతికించుకొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం సాధించుకుందామని పేర్కొన్నారు. వైఎస్ హయాంలోనే హైదరాబాద్ మహానగరం అభివృద్ధి వైపు పరుగులు తీసిందని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రోరైలు.. ఇలా అన్నీ ఆ మహానేత చేసినవేనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement