రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సాగిస్తున్న పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు నెలరోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా విభజనపై వెనక్కు వెళ్లేది లేదని కాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమంటోంది వైఎస్సార్ సీపీ. నదీ జలాలు, హైదరాబాద్ నగరం, శాంతిభద్రతలు వంటి జటిలమైన అంశాలను పరిష్కరించటం సాధ్యంకాదంటోంది. ఈ కారణంగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. సమైక్య శంఖారావం పూరించారు. ఈ సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆమె వెంట పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.
Sep 2 2013 6:51 PM | Updated on Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement