ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కోరిన శశికళ విన్నపాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. శశికళతో పాటు ఇదే కేసులో దోషులుగా ఉన్న ఇళవరసి, సుధాకర న్‌లు కూడా వెళ్లారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక కోర్టులో తొలుత లొంగిపోయి అనంతరం వీరు జైలుకు వెళ్లాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక కోర్టును పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేశారు.