శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు | Sasikala's Betrayal? Nephews Expelled By Jayalalithaa Back In Party | Sakshi
Sakshi News home page

Feb 15 2017 11:34 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో జైలుకి వెళ్లబోతున్న శశికళ, తన బంధువులే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు తిప్పేలా ప్లాన్స్ వేస్తున్నారు. తన మేనల్లుడు టీటీవీ దినకరన్కు అన్నాడీఎంకే పార్టీలో పెద్ద పోస్టునే కట్టబెట్టారు. అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు, దినకరన్ను డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దినకరన్ను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2011లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నియామకంతో జైలు నుంచే పార్టీని కంట్రోల్ చేయాలని శశికళ భావిస్తున్నారు. అంతేకాక శశికళ మరో మేనల్లుడు వెంకటేష్ను కూడా తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే టీటీవీ దినకరన్ను పార్టీలో నేతలెవరూ అంగీకరించడం లేదని తెలుస్తోంది. శశికళ తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో ఇది ఒకటిగా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement