కర్ణాటకలో దారుణం జరిగింది. ఆలయం ప్రాంగణంలోకి చొరబడిన ఓ ముసుగు వ్యక్తి.. పెద్ద కత్తి తీసుకుని ఆలయ అధికారిణిపై దాడికి తెగబడ్డాడు. ఆమె ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నా వదలకుండా వెంటపడి మరీ దాడి చేసేందుకు దూసుకొచ్చాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.