అంగన్‌వాడీ కార్యకర్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అంగన్ వాడీ కార్యకర్తలకు, సహాయ సిబ్బందికి జీతాలు పెంచుతూ ప్రకటన చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలు జీతం నెలకు రూ.10, 500, కార్యకర్తల సహయకుల జీతం రూ.6000లకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు తగినంత ఆహారం ఇవ్వాలని, గతంలో ఇచ్చినట్లు గ్రాముల లెక్కన వారికి ఆహారం ఇవ్వరాదని, అలాగే పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Feb 27 2017 5:23 PM | Updated on Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement