వచ్చే నెలలో జరగాల్సిన సార్క్ సమావేశాల్ని భారత్, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకలు బహిష్కరించడంతో... విధిలేని పరిస్థితుల్లో సదస్సును పాకిస్తాన్ వాయిదావేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9, 10 తేదీల్లో ఇస్లామాబాద్‌లో 19వ సార్క్ సమావేశాలు జరగాల్సి ఉండగా... ఉడీ దాడి నేపథ్యంలో భారత్ సమావేశాల్ని బహిష్కరించింది. సమావేశాలు జరిగేందుకు అనువైన వాతావరణాన్ని పాక్ పాడుచేసిదంటూ బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్‌లు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. సమావేశాలకు తాము హాజరుకావడం లేదంటూ శ్రీలంక కూడా శుక్రవారం పకటించింది.
Oct 1 2016 8:29 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement