ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రధాని మోదీ పోగొట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నల్లధనాన్ని వెలికి తీయడానికి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదని ప్రజలు అంటుకున్నారని చెప్పారు.