పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారినప్పుడే రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపినట్టు తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. స్పీకర్ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు. తాము రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేయడం తమకు సమస్యేనని ఒప్పుకున్నారు.