'విజయవాడ కోర్టుకు ఆ అధికారం లేదు' | Sakshi
Sakshi News home page

'విజయవాడ కోర్టుకు ఆ అధికారం లేదు'

Published Thu, Jul 30 2015 3:16 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సాయంత్రం తీర్పు వెలువరించే అవకాశముంది. కాల్ డేటా ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లను విజయవాడ కోర్టు ఆదేశించడాన్ని హైకోర్టులో తెలంగాణ సర్కారు సవాల్ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదనలు వినిపించారు. కాల్ డేటా ఇవ్వాలని టెలిఫోన్ ఆపరేటర్లను కోరే అధికారం విజయవాడ కోర్టుకు లేదని జెఠ్మలానీ వాదించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'సిట్' దర్యాప్తు కొనసాగిస్తోంది.