'ఐపీఎస్ లు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి' | Sakshi
Sakshi News home page

'ఐపీఎస్ లు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి'

Published Fri, Oct 31 2014 11:40 AM

పరస్పరం సహకరించుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మీరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలని ఐపీఎస్ అధికారులకు హితవు పలికారు. శుక్రవారం హైదరాబాద్ నగర శివారుల్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పెరేడ్లో రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పటేల్ జన్మదినాన్ని ఏక్తా దివాస్గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని ఈ సందర్బంగా చెప్పారు. 66వ పాసింగ్ ఔట్ పెరేడ్లో128 మంది ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 19 మంది మహిళలు ఉన్నారు. మరో 15 మంది విదేశాలకు చెందిన అధికారులు ఉన్నారు.