డీఎంకే అధినేత కరుణానిధి భార్య రాజాతి అమ్మాళ్ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జయలలిత సన్నిహితురాలు శశికళను కలసి వివరాలు తెలుసున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అమ్మాళ్ ఆకాంక్షించారు. అమ్మాళ్ శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రికి వెళ్లినట్టు అన్నా డీఎంకే, డీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ఇటీవల అపోలోకు వెళ్లి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేసిన సంగతి తెలిసిందే.