రాధేమాకు వీఐపీ ట్రీట్‌మెంట్‌.. విమర్శలు | Radhe Maa Gets VIP Treatment, SHO's Chair in Delhi Police Station | Sakshi
Sakshi News home page

రాధేమాకు వీఐపీ ట్రీట్‌మెంట్‌.. విమర్శలు

Oct 5 2017 2:16 PM | Updated on Mar 22 2024 11:03 AM

దొంగ బాబాలు, నకిలీ స్వామీజీల వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో దైవాంశ సంభూతులమని ప్రకటించేవారిని నమ్మి మోసపోకండంటూ మొత్తుకుంటున్నా.. వీర భక్తులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. వివాదాస్పద మాత రాధేమా విషయంలోనూ అంతే.. తాజాగా ఆమె ఓ పోలీస్‌ స్టేసన్‌ వెళ్లితే ఎలాంటి మర్యాద దక్కిందో ఓసారి చూడండి. దక్షిణ ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు రాధే మా వెళ్లింది. ఈ సందర్భంగా స్టేషన్‌ ప్రధానాధికారి ఎదురెళ్లి మరీ మాతాజీకి స్వాగతం పలికాడు. పైగా తన కుర్చీలోనే ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ ఫోటోలు బయటకు పొక్కగా.. ఆ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాధేమా వీఐపీ ట్రీట్‌మెంట్‌ అంశం తమ దృష్టికి చేరిందని.. అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దర్యాప్తు తర్వాత తేలుస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement